మన్యం న్యూస్, పినపాక:
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తల్లి బిడ్డల క్షేమం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందించే న్యూట్రిషన్ కిట్లను సోమవారం నాడు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు దుర్గ భవాని అందించారు.గర్భిణీలు సరైన పోషకాహారం తీసుకున్నప్పుడే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని ఆమె అన్నారు. ప్రతిరోజు గర్భిణీలు ఆశా కార్యకర్తలు చెప్పిన విధంగా పోషకాహారం తీసుకోవాలని సూచించారు. సుఖ ప్రసవానికి ప్రతిరోజు యోగా, వ్యాయామం తప్పనిసరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.