మన్యం న్యూస్, మణుగూరు, మార్చి27: మణుగూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి ఆపరేషన్స్ కొరకు ఖమ్మం లోని ప్రధాన ఆసుపత్రికి కొంత మందిని పంపడం జరిగిందని నేత్రవైద్యాధికారి సంజీవరావు సోమవారం తెలిపారు.
ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద డాక్టర్ రాం నాయక్ వారి సిబ్బంది కంటి ఆపరేషన్స్ నిర్వహించారన్నారు. కంటి ఆపరేషన్స్ చేయించుకొని వచ్చిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నరేష్, డాక్టర్ సునీల్ తదితరులు పాల్గొన్నారు.