ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గించాలని .. విజ్ఞప్తి చేసిన కొత్తగూడెం వర్తక, వ్యాపార సంఘాలు.. హామీ ఇచ్చిన వనమా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి.. కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన తర్వాత వర్తక వ్యాపార సంఘాలు దిన దినాభిలా వృద్ది చెందుతున్నాయని వర్తక వ్యాపార సంఘాలకు తాను ఇప్పుడు అండగా ఉంటానని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో కొత్తగూడెంలోని చిన్న బజార్ పెద్ద బజార్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి వ్యాపార వర్తక సంఘాలతో మాట్లాడారు. ఈ సందర్భంలో కొత్తగూడెంలోని వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు తగ్గించాలని వ్యాపార వర్తకులు విజ్ఞప్తి చేశారు, దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వనమా మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తగ్గింపుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు
ఎమ్మెల్యే వనమామ కలిసిన వారిలో కొత్తగూడెం చిన్న బజార్, పెద్ద బజార్, వాణిజ్య, వర్తక, వ్యాపార వర్గాలకు చెందిన నాయకులు, ప్రతినిధులు ఉన్నారు