UPDATES  

 డీఆర్సీసీ నందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు..

మన్యం న్యూస్, ఇల్లందు టౌన్:తెలంగాణ రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలిచిన ఇల్లందు మున్సిపాలిటీ ఎరువుల తయారీ కేంద్రాన్ని ఇల్లందు పురపాలక ఛైర్మెన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు సోమవారం సందర్శించారు. ఇల్లందు పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన డీఆర్సీసీ ఎరువుల తయారీ కేంద్రం నందు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇల్లందు ఎరువుల తయారీ కేంద్రం అనేకమంది ప్రముఖుల ప్రశంసలు పొందిన విషయం అందరికీ తెలిసిన విషయమేనని, ఇల్లందు పట్టణ ప్రజల నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరించి చెత్తను వాహనాల్లో ఎరువు తయారీ కేంద్రానికి తరలించి ఎరువుగా తయారుచేసి అలాగే పొడి చెత్తను రీసైక్లింగ్ చేయుటకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద ఎరువు తయారీ కేంద్రం మన ఇల్లందు పట్టణంలోనే ఉందని తెలిపారు. ఎరువుల తయారీ కేంద్రం రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా నిలవడానికి పట్టణ ప్రజల సహకారం ఎంతో ఉందని తెలిపారు. పట్టణ ప్రజలందరూ తడి చెత్త, పొడిచిత్త వేరు చేయడం వల్లనే ఎరువుల తయారీకి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. తొంభై శాతం ప్రజలు తడి చెత్త మరియు పొడి చెత్త వేరు చేస్తున్నారని, మిగిలిన పదిశాతం ప్రజలు కూడా వేరు చేస్తే నూరు శాతం ఎరువు తయారు చేసేవిధంగా ఇల్లందు పురపాలక సంఘానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ, జవాన్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !