UPDATES  

 ములుగు జిల్లాలో రాజుపేట మండలం ప్రకటించాలి..రాజుపేట మండలం ప్రకటించాలని అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే సీతక్క కి కృతజ్ఞతలు…  జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…..

  • ములుగు జిల్లాలో రాజుపేట మండలం ప్రకటించాలి…
  • రాజుపేట మండలం ప్రకటించాలని అసెంబ్లీలో గళం విప్పిన ఎమ్మెల్యే సీతక్క కి కృతజ్ఞతలు…
  • జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి…

 

మన్యం న్యూస్, మంగపేట.

ములుగు జిల్లాలోని మంగపేట మండలం పరిధిలో ఉన్న రాజుపేట గ్రామపంచాయతీ కేంద్రంగా చేసుకొని సమీప గ్రామాలన్నీ కలుపుతూ రాజుపేట మండల కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి డిమాండ్ చేశారు. ఆయన సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ములుగు జిల్లా ఏర్పడిన తర్వాత ఇంకా నూతనంగా రాజుపేట మల్లంపల్లి గ్రామాలను మండలాలుగా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అకినేపళ్లి మల్లారం నుంచి మంగపేట మండల కేంద్రం 30 కిలోమీటర్ల దూరంలో ఉందని ప్రభుత్వాలు పరిపాలనను ప్రజల చెంతకు చేర్చే విధంగా ఉండాలి తప్ప మరింత ఇబ్బందులు వచ్చేలా ఉండకూడదని అన్నారు అకినేపల్లి మల్లారం నుంచి చుంచుపల్లి వరకు గల అన్ని గ్రామపంచాయతీలను రాజుపేట మండల కేంద్రంలో పరిధిలోకి తీసుకురావాలని సాంబశివరెడ్డి కోరారు. ఇదే అంశాన్ని ములుగు శాసనసభ్యురాలు సీతక్క అసెంబ్లీలో రెండు పర్యాయాలు మాట్లాడడం జరిగిందని గుర్తు చేశారు. రాజుపేట ను మండల కేంద్రంగా ప్రకటించాలని శాసనసభలో గళం వినిపించిన ములుగు ఎమ్మెల్యే సీతక్కని సాంబశివరెడ్డి రాజుపేట ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు రాజుపేట నూతన మండలంగా ఏర్పడితే శాంతి భద్రతల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ మండల స్థాయి ఆసుపత్రి వెటర్నరీ ఆసుపత్రి మండల పరిషత్ తహసిల్దార్ రెవెన్యూ కార్యాలయాలు సహా మండల స్థాయిలో ఉన్న అన్ని శాఖల కార్యాలయాలు మరియు అధికారులు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. రాజుపేట మండలం కేంద్రం ఏర్పాటు కోసం అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు సబ్బండ వర్ణాల ప్రజలు రైతులు కార్మికులు విద్యార్థులు మహిళా సంఘాలు అందరూ కలిసి రావాలని కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !