మన్యం న్యూస్, మణుగూరు, మార్చి27: మణుగూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పాత వాహనాల వేలంపాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మణుగూరు ఎక్సైజ్ సీఐ రామ్మూర్తి సోమవారం తెలిపారు. వివిధ నేరాల్లో పట్టుబడి తుప్పు పట్టిన వాహనాలకు మంగళవారం మణుగూరు ఎక్సైజ్ కార్యాలయం నందు ఉదయం 11 గంటలకు వేలం పాట ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన వారు 11 గంటలకల్లా ఎక్సైజ్ కార్యాలయానికి చేరుకొని వేలంపాటలో పాల్గొనాలని ఆయన కోరారు.
