UPDATES  

 చిరు ధాన్యాలపై అవగాహన కలిగి ఉండాలి… – సీడీపీవో జయలక్ష్మి..

మన్యం న్యూస్, మణుగూరు, మార్చి27: చిరు ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు, పిండి పదార్ధాలు, ప్రొటీన్ల తో పాటు ఐరన్, కాలుష్యం అధికంగా ఉండి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుందని ఐసీడీఎస్ సీడీపీవో జయలక్ష్మి అన్నారు. సోమవారం పోషణ పక్వాడ కార్యక్రమాల్లో భాగంగా సాంబాయిగూడెం సెక్టార్ అంగన్వాడీ-1 కేంద్రంలో సుమారు 60మంది విద్యార్ధులకు రక్త పరీక్షలు నిర్వహించి రక్త శాతం పరిశీలించారు. అనంతరం విద్యార్ధులకు, తల్లులకు చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గర్భిణులకు శ్రీమంతం చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ పద్మ,భద్రమ్మ, పోషణ అభియాన్ బీసీ నాగేశ్వరరావు, ఏ ఎన్ ఎం నందిని, వెంకట లక్ష్మీ, అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !