మన్యం న్యూస్, మణుగూరు, మార్చి27: మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల వలస ఆదివాసీ గిరిజన గ్రామం పెద్ది పల్లి లో సోమవారం హెల్త్ క్యాంప్ నిర్వహించి మందులు అందజేశారు. ప్రతి ఇంటికి తిరుగుతూ జ్వరాలు ఉన్న వారి నుండి రక్త నమూనాలు సేకరించి మందులు అందజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, తప్పనిసరిగా దోమ తెరలు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమం లో హెల్త్ అసిస్టెంట్లు రాంప్రసాద్ , ఉమెస్, శైలజ, రోజా తదితరులు పాల్గొన్నారు.
