మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
అన్ని శాఖల సిబ్బంది తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజల నుంచి పిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు వారి సిబ్బంది తప్పని సరిగా బయోమెట్రిక్ వేసే
విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే మాసం నుంచి బయోమెట్రిక్ ఆధారంగానే వేతనాలు చెల్లించు విధంగా చర్యలు తీసుకుంటామని, గైర్హాజరైన కాలానికి వేతనం చెల్లించబడదని ఆయన పేర్కొన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు
నిర్మాణానికి భూ సేకరణలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందచేయాలని చెప్పారు. పెండింగ్లో ఉంచితే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వారం రోజుల్లో పరిహారం అందించే విధంగా ఆర్డీఓలు చర్యలు తీసుకోవాలని
చెప్పారు. క్లియర్గా ఉన్న భూముల రైతులకు పరిహారం అందించాలని చెప్పారు.ప్రజావాణిలో సమస్య పరిష్కారం కొరకు అందచేసిన దరఖాస్తులు కొన్ని::-
మణుగూరు మండలం, గాంధీబొమ్మకు చెందిన చల్లా నీలమ్మ తన తండ్రి లేటు చల్లా వెంకయ్య పరున్న సర్వే
నెం.16/22లో ఉన్న మూడు ఎకరాల భూమిలో కొంత భూమి సింగరేణి ఓపెన్కాస్ట్ లో పోయిందని, సర్వే రికార్డులలో కూడా తన తండ్రి పేరుందని, కావున విచారణ నిర్వహించి తనకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని
చేసిన దరఖాస్తును తగు చర్యలు కొరకు భూ సేకరణ విభాగం పర్యవేక్షకులకు ఎండార్స్ చేశారు.
దమ్మపేట మండలం, మందలపల్లి గ్రామానికి చెందిన ములకపాటి వెంకటేశ్వరావు తన కుమార్తె సుమలతకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం మంజూరుకు దరఖాస్తు చేసుకున్నామని, దరఖాస్తుకు ఎస్సీ కుల ధృవీకరణ
పత్రం పెట్టామని, క్రైస్తవ మతం తీసుకున్నందున ఎస్సి కుల ధృవీకరణ చెల్లదని తిరస్కరించారని, తిరిడి బిసి(సి) ధృవీకరణతో దరఖాస్తు చేయగా మళ్లీ తిరస్కరించారని, విచారణ నిర్వహించి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం
అందించు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం దమ్మపేట తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.
కొత్తగూడెం మున్సిపాల్టీ పరిధిలోని కూలిలైన్కు చెందిన దోమల కౌసల్య ఇంటి నెం.5-2-65లో 40 సంవత్సరాల నుంచి నివాసం ఉంటుంన్నామని, తమ ఇంటికి మున్సిపాల్టీ నుంచి ఇంటి పన్ను రూ.33,631 వేశారని, తిరిగి విచారణ నిర్వహించి పన్ను లెక్కింపు చేయాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ పన్ను లెక్కింపు చేయాలని మున్సిపల్
కమిషనర్ను ఆదేశించారు.భద్రాచలం మండలం, పట్టణానికి చెందిన తిరుపతి మంజువాణి తన తండ్రి మేఘ వెంకటగురుమూర్తి పేరున
సర్వే నెం.57/2ఆలో ఉన్న రెండు ఎకరాల భూమిని తన పేరున మార్చాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు కొరకు ధరణి కో ఆర్డినేటర్కు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం, సంపత్నగర్ గ్రామానికి చెందిన ఇర్పా ఎల్లమ్మ 2020 సంవత్సరంలో గ్యాస్ సిలెండర్
పేలడం వల్ల 4 గదుల స్లాబ్ ఇల్లు కూలిపోయిందని, తద్వారా నివాసం ఉండటానికి ఇల్లు లేకుండా పోయిందని, తనకు
రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఆర్డీఓకుఎండార్స్ చేశారు.
దుమ్ముగూడెం మండలం కాశీనగర్ గ్రామానికి చెందిన నాగవెంకటశివ సంతోష్ సర్వే నెం.20/1/అ/2లో
ఉన్న భూమికి పాసుబుక్కు ఇప్పించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం తహసిల్దార్కు ఎండార్స్ చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.