మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
పోరాటాల ద్వారానే ప్రజాసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.సోమవారం ఆయన పాల్వంచ పట్టణ పరిధిలోని వికలాంగుల కాలనీలో పర్యటించి ప్రజాసమస్యలు తెలుసుకున్నారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యల గురించి యాచిస్తే పాలకులు మాట వినరని,పోరాటాలు చేస్తేనే దిగి వస్తారని అన్నారు.నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలలో నేనున్నానని భరోసా కల్పించడమే నాయకుడి లక్షణమని,అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయడంలో వెనక్కి తగ్గేది లేదని అన్నారు.ప్రభుత్వాలకు,స్థానిక ప్రజా ప్రతినిధులకు,ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో వారికి తెలుసని…కానీ వాటిని పరిష్కరించే ఉద్దేశం ఎంత మాత్రం ఎమ్మెల్యే వనమాకి లేదని అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని,సమస్యల పరిష్కారం కోసం బీఎస్పీ అలుపెరుగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.సమస్యల పరిష్కారం కోసం జిల్లా అధికారులను అనునిత్యం కలుస్తూ వినతి పత్రాలను కూడా అందజేస్తున్నానని వివరించారు.సమస్యలు ఎంతకూ పరిష్కారం కానిపక్షంలో వివిధ దఫాలుగా ఆందోళనలు నిర్వహిస్తూ పోరాటాలు చేస్తున్నట్లు తెలిపారు.
*ఈసందర్భంగా పలువురు మహిళలు బీఎస్పీ చేరారు*
ఈకార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ నల్లగట్ల రఘు,పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్,బొల్లేపోగు విజయ,వెంకటమ్మ,తెలురి నాగమణి,చీకటి కృష్ణవేణి,గుడిమిలా లీల,గద్దెల రాజమ్మ* తదితరులు పాల్గొన్నారు.