మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
సెక్యూరిటీ గార్డుల పట్ల వివక్ష చూపెట్టకుండా, వెంటనే సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. మధు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా చీీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ హనుమంత రావు కి సోమవారం వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా మధు మాట్లాడుతూ ఇటీవల సింగరేణి వ్యాప్తంగా సెక్యూరిటీ విభాగంలో ప్రైవేట్ గార్డుల సప్లై కొరకు నూతన టెండర్లను ఫైనల్ చేశారన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులకు కామన్ గా ఖాకి యూనిఫామ్ నిర్ణయించాలని దానిని ఉచితంగా అందజేయాలని కోరారు. పెరిగిన ధరలు నేపథ్యంలో చాలీచాలని వేతనాలతో పూర్తిస్థాయి మస్టర్లు కూడా దొరకక ప్రవేట్ సెక్యూరిటీ గార్డులు కుటుంబాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . అటువంటి వారిపై యూనిఫామ్ పేరుతో ఆర్ధిక భారాన్ని వేయడం సరికాదన్నరు. అంతేకాదు యూనిఫామ్ ఇవ్వటం యజమాని యొక్క బాధ్యత అని అన్నారు. అలాగే సివిల్ టెండర్లలో కాంట్రాక్ట్ కార్మికులకు ఉచితంగా మెడికల్ చేయుచున్నారన్నారు. కానీ ఎస్&పిసి విభాగంలోని ప్రైవేట్ గార్డులకు చేయడంలేదని ఇది సరికాదన్నారు. కావున తమరు కాంట్రాక్ట్ కార్మికుల యొక్క ఆర్థిక ఇబ్బందులను అర్ధం చేసుకొని సింగరేణి వ్యాప్తంగా కామన్ ఖాకీ యూనిఫాం ఉచితంగా ఇవ్వవలసిందిగా, అలాగే ఉచిత మెడికల్ సౌకర్యం కల్పించాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా ఒకే యూనిఫాం (అది కూడా ఖాకీ డ్రెస్ ను) ఉచితంగా ఇవ్వాలన్నారు . ఉచిత ఐఎంఇ / 1. ఎంఇ సౌకర్యం కల్పించాలన్నారు . పెరేడ్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. దూర ప్రాంతాలకు విధులు నిర్వహణకు వెళ్లే వారికి కన్వెయన్స్ సౌకర్యం కల్పించాలనీ, పోస్టుల వద్ద మంచినీరు, లైటింగ్, రక్షణ తదితర సౌకర్యాలు కల్పించాలన్నారు. విధి నిర్వహణలో గాయపడిన వారికి రెస్ట్ కాలంలో వేతనాలు చెల్లించాల నీ,. మెరుగైన వైద్యం అందించాలని, రామగుండం కేంద్రంగా సెక్యూరిటీ గార్డుల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటి సభ్యులు భూక్య రమేష్ పాల్గొన్నారు
