UPDATES  

 అంతర్గత చార్జ్ సేఫ్టీ ల్యాంప్ పోస్టుకు సింగరేణి ఉద్యోగులకు వ్రాత పరీక్ష..

మన్యం న్యూస్ మణుగూరు టౌన్:

, మణుగూరు ఏరియా సింగరేణి కాలరీస్ నందు వివిధ విభాగాలలో పని చేస్తూ,చార్జర్ సేఫ్టీ ల్యాంప్ గా పని చేయుటకు ఆసక్తి,అర్హత గల అంతర్గత ఉద్యోగుల కు సోమవారం పైలట్ కాలనీ లోని ఎంవిటిసి కార్యలయం నందు వ్రాత పరీక్ష నిర్వహించడం జరిగింది.ఈ పరీక్షను ఏరియా ఎస్ఓ టు జిఎం డి.లలిత్ కుమార్,ఏరియా డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్ పర్యవేక్షణలో నిర్వహించారు. ముందుగా సీల్డ్ కవర్లో ఉన్న ప్రశ్న పత్రాన్ని ఓపెన్ చేసి అభ్యర్ధులకు అందజేయడం జరిగింది.రెండు పోస్టుల కోసం ఇద్దరు అభ్యర్థులు హాజరు కాగా,వ్రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఇద్దరు అభ్యర్ధులను ఎంపిక చేయడం జరిగింది అని వారు తెలిపారు.పరీక్ష ఫలితాలను సాయంత్రం 5:00 గంటలకు నోటిస్ బోర్డు ద్వారా తెలియజేయడం జరుగుతుంది అన్నారు.పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులకు ఏరియాలో ఉన్న ఖాళీలకు అనుగుణంగా నియామకం చేపట్టడం జరుగుతుందని డిజిఎం పర్సనల్ ఎస్.రమేశ్ తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఏరియా రక్షణ అధికారి వెంకట రమణ,ఎంవిటిసి మేనేజర్ నాగేశ్వర రావు, అడిషనల్ మేనేజర్ లక్ష్మణ్ రావు,సీనియర్ పర్సనల్ అధికారి సింగు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !