మన్యం న్యూస్ దుమ్మగూడెం:: సీతారామచంద్రస్వామి వారి దర్శనానికి పర్ణశాల వచ్చే వాహనాల నుంచి పార్కింగ్ వసూలు చేసేందుకు లైసెన్సు గాను 2023 – 24 సంవత్సరానికి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో బహిరంగ వేలం పాట పర్ణశాల గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. ఈ పాటలో 5గురు పాటదారులు పాల్గొనగా పెద్ద బండి రేవు గ్రామానికి చెందిన సోయం రమేష్ 26 లక్షల అరవై వేల రూపాయలతో హెచ్చు పాట పాడి పాటను దక్కించుకున్నాడు. గత ఏడాది 14 లక్షలు పాట పాడగా ప్రస్తుతం ఎక్కువ ధర రావడంతో గ్రామపంచాయతీ ఆర్థిక సంవత్సరానికి అదనపు ఆదాయం లభించింది. ముందుగా నిర్వహించిన గోదావరి బోర్డ్ షికారు వేలంపాటుకు అనుకున్న ధర రాకపోవడంతో బోటు షికారు వేలంపాటను వాయిదా వేశారు ఈ వేలంపాటలో పంచాయతీ మండల అధికారి ముత్యాలరావు ఎంపీటీసీ తెల్లం భీమరాజు ఉపసర్పంచ్ ఖాదర్ బాబు గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి వాగే రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
