UPDATES  

 గురుకులం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..- ఐటీడీఏ జనరల్ ఏపీవో డేవిడ్ రాజ్..

మన్యం న్యూస్, భద్రాచలం :

అకాల వర్షాలు వాతావరణం మార్పు వలన ఆశ్రమం పాఠశాలలు, గురుకులాలలో పరిసరాలన్నీ శుభ్రంగా ఉండేలా చూస్తూ, పిల్లల యొక్క వ్యక్తిగత శుభ్రత, ఆరోగ్యం గురించి సంబంధిత అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ జనరల్ సహాయ ప్రాజెక్టు అధికారి డేవిడ్ రాజ్ అన్నారు. సోమవారం భద్రాచలం ఐటిడిఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్లో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ అధికారిక పనులపై వెళ్లి అందుబాటులో లేనందున, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవితో కలిసి వివిధ గిరిజన గ్రామాల నుండి వచ్చిన గిరిజనుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించి, తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ వీలైనంత తొందరగా అర్హులైన ప్రతి గిరిజనులకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో ఆన్లైన్ ద్వారా నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు విడతల వారీగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడి అగ్రికల్చర్ భాస్కరన్, ఏసీఎంవో రమణయ్య, డిఎస్ఓ ప్రభాకర్ రావు, పవర్ ఏపీవో మునీర్ పాషా, డి.టి. ఆర్.ఓ.ఎఫ్.ఆర్ శ్రీనివాస్, జేడీఎం హరికృష్ణ, ఐటీడీఏలోని వివిధ విభాగాల నుంచి నాగభూషణం, వెంకటేశ్వర్లు ,దుర్గయ్య, రాజాచార్యులు, సుగుణ, రాందాస్ ,అపర్ణ ,సులోచన, ప్రమీల బాయ్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !