మన్యం న్యూస్, భద్రాచలం :
సిపిఎం రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న జనచైతన్య యాత్ర ముగింపు సభ మార్చి 29న హైదరాబాదులో ఇందిర పార్క్ నందు జరగనున్నదని ఈ సభకు భద్రాచలం నియోజకవర్గం లోని ఐదు మండలాల నుంచి సిపిఎం పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఎం భద్రాచలం నియోజకవర్గం కన్వీనర్, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు పిలుపు ఇచ్చారు. సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ సమావేశం ఎంబీ నర్సారెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజాకంటక పాలనను ఎండగడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మార్చి 17న ప్రారంభమైన సిపిఎం జన చైతన్య యాత్ర ముగింపు సభ మార్చ్ 29 హైదరాబాద్ ఈ సభకు భద్రాచలం నియోజకవర్గం లోని వాజేడు, వెంకటాపురం, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండలాల నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ముగింపు సభకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ ప్రకాష్ కారత్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పట్న కార్యదర్శి వర్గ సభ్యులు బండారు శరత్ బాబు, వై.వెంకట రామారావు, పి.సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, యు.జ్యోతి, బి.కుసుమ, జీవనజ్యోతి, ఎం.నాగరాజు, కోరాడ శ్రీనివాస్, కుంజా శ్రీనివాస్, జి.లక్ష్మీకాంత్, తదితరులు పాల్గొన్నారు.