మన్యం న్యూస్,ఇల్లందు టౌన్:ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక రెండవ వార్డుకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు పట్టణ మహిళా సెక్రటరీ రత్తారపు మల్లీశ్వరి భర్త రత్తారపు రేణు (శ్రీను) ఆర్టీసీ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తూ ఇటీవల బలవన్మరణానికి పాల్పడి మృతి చెందిన విషయం అందరికీ విధితమే. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ సోమవారం రత్తారపు మల్లీశ్వరి స్వగృహానికి వెళ్లి వారిని ఓదార్చి వారి కుటుంబానికి మనోధైర్యాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, స్థానిక వార్డు కౌన్సిలర్ కటకం పద్మావతి ,పట్టణ అధ్యక్షుడు నాదేండ్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వరరావు, ఇల్లందు మండల ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి రేణుక, ఇల్లందు ఉపాధ్యక్షుడు పెండ్యాల హరి కృష్ణ,టౌన్ కమిటీ రాచపల్లి శ్రీను,సనా రాజేష్,ఇల్లందు పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇన్చార్జి గిన్నారపు రాజేష్, ఇల్లందు పట్టణ మహిళా కమిటీ గండ్రతి చంద్రావతి, బోప్పి భాగ్యలక్ష్మి, యువజన నాయకులు పాలడుగు రాజశేఖర్, శ్రావణ్ పాల్గొన్నారు.
