మన్యం న్యూస్,ఇల్లందు టౌన్*:తెలంగాణ సీఎం కేసీఆర్ ,వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 1 తేదీ నుంచి 13వ తేదీవరకు జరగబోయే బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోనే బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. పార్టీ శ్రేణులు కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహించుకోవాలన్న ముఖ్యమంత్రి పిలుపుమేరకు ప్రజాప్రతినిధులు ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలన్నారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు బిఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా కృషి చేయాలని ప్రజాప్రతినిధులను ఎమ్మెల్యే హరిప్రియ హరిసింగ్ నాయక్ ఆదేశించారు.
