ఎల్బీనగర్
హైటెక్ హంగులతో రూపొందించిన తొమ్మిది ఏసీ స్లీపర్ బస్సులను ఆర్టీసీ తొలిసారిగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ బస్సులకు దీటుగా రూపొందించిన ఈ బస్సులను హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా 760 బస్సులకు ఆర్డర్ పెట్టామని, వాటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయన్నారు. ప్రయాణికులకు సౌకర్యం కోసం ప్రైవేటు బస్సులకు దీటుగా లహరి స్లీపర్ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు.