UPDATES  

 ముఖ్యమంత్రి కెసిఆర్ దీవెన.. పినపాక ఎమ్మెల్యే రేగన్న సాధన..

  • ముఖ్యమంత్రి కెసిఆర్ దీవెన
  • పినపాక ఎమ్మెల్యే రేగన్న సాధన
  •  అనుకున్నది సాధించిన మన్యం బిడ్డ
  • ముఖ్యమంత్రి ఆదేశిస్తారు …పినపాక ప్రజల కోసం పనిచేస్తాను
  • నా జీవితం పేద బడుగు బలహీన వర్గాల కోసమే అంకితం… పినపాక ఎమ్మెల్యే రేగా
  • రూ 158కోట్లతో పినపాక నియోజకవర్గం లో అభివృద్ధి పనులు

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి

ఊకదంపుడు ఉపన్యాసాలు నాకు రావు.. అనుకున్నది ఏదో ముఖం మీదనే నిక్కచ్చిగా చెబుతాను… ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఓడదాటిన తర్వాత బోడ మల్లయ్య అనే సిద్ధాంతం నాది కాదు.. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బడుగు బలహీన వర్గాలకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శాసిస్తారు..పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే తాను పనిచేస్తానని అందుకు బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందని పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు స్పష్టం చేశారు . మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ పిన పాక నియోజకవర్గం కి రూ.158 కోట్ల అభివృద్ధి పనులు మంజూరు చేసిన సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు . ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో కాపీలను మీడియాకు చూపించారు. పినపాక నియోజకవర్గం కి ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.100 కోట్ల నిధులతో సుమారు 487 పనులు ట్రైబల్ వెల్ఫేర్ పండు ద్వారా రూ.52 కోట్లతో..గిరిజన గ్రామాలకు 34 రోడ్ల పనులకు మంజూరు చేయడం తో బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని తెలిపారు పినపాక నియోజకవర్గం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరిన వెంటనే ట్రైబల్ వెల్ఫేర్ పండు ద్వారా మంజూరైన రూ.52 కోట్లతో గిరిజన గ్రామాలను సమన్వయం చేసేందుకు కరకగూడెం మండలంలో 6 రోడ్లు, పినపాక మండలంలో 10 రోడ్లు మణుగూరు మండలంలో 6 రోడ్లు అశ్వాపురం మండలంలో 9 గుండాలలో ఒకటి ఆలపల్లి మండలంలో 2 రోడ్లతో 34 రోడ్డు పనులను మంజూరు చేయడంతో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా రూ.100 కోట్ల నిధులతో 487 పనులలో ఎస్సీ కేటగిరీలో 210 పనులు ఎస్టీ క్యాటగిరీలో 210 పనులు జనరల్ కేటగిరీలో 67 పనులతో పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా 108 కోట్ల నిధులు మంజూరు చేయించి మొత్తం 521 పనులను అధికారులు త్వరితగతిన పూర్తి చేసి నియోజకవర్గం అభివృద్ధికి సహకరించాలని రేగా కాంతారావు సూచించారు. రాష్ట్రంలోని పిరిపాక నియోజకవర్గం ఒక సంపూర్ణమైన స్థానాన్ని కైవసం చేసుకొని అభివృద్ధిలో ముందంజలో ఉంచడంలో పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేపట్టిన ప్రత్యేక కృషి మూలంగా ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాటలు చెప్పి హామీలిచ్చి తప్పుకునే నాయకుడు కాదని తను నమ్ముకున్న ప్రజల కోసం అనునిత్యం శ్రమిస్తూ నిస్వార్ధమైన సేవను అందించడంలో ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రధముడు అని ఆకాంక్షిస్తున్నారు. పల్లె జన గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొని తాను చేసే అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోవాలని కంకణ బద్ధుడై అనునిత్యం పినపాక నియోజకవర్గంలో మార్ముల గిరిజన గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకోవడమే కాకుండా స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పట్టుబట్టి పినపాక అభివృద్ధికి కృషి చేసిన మన్యంబిడ్డ మొండితనానికి అందరూ జేజేలు పలుకుతున్నారు. తనకు రాజకీయాలు కొత్తవి ఏమీ కాదని గెలుపు ఓటములు సాధ్యమేనని అయితే కొందరు కల్లబొల్లి మాటలు చెబుతూ పగటివేషగాళ్లు పల్లెలపై సంచరిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ప్రజలే వారికి తగినైన సమాధానం చెప్పే సమయం ఆసన్నమైందని పినపాక ఎమ్మెల్యే రేగా స్పష్టం చేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !