UPDATES  

 సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రమాణాల విద్యకు నిలయాలు –:ఇంచార్జ్ ఎస్ ఓ టు జిఎం వెంకట రమణ..

మన్యం న్యూస్ మణుగూరు టౌన్

, మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాటశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్ధులకు ఫేర్ వెల్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇంచార్జ్ ఎస్ ఓ టు జిఎం వెంకట రమణ, విశిష్ట అతిధిగా స్కూల్ కరస్పోండెంట్ డిజిఎం పర్సనల్ ఎస్ రమేశ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు విద్యార్ధులను,వారి తల్లిదండ్రులను ఉద్ధేశించి మాట్లాడుతూ,సింగరేణి పాఠశాలలు ఉన్నత ప్రామాణాల విద్యకు నిలయాలు అని,సింగరేణి యాజమాన్యం ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యార్ధులకు సకల సౌకర్యాలతో పాటు,వైజ్ఞానిక, సృజనాత్మకతతో కూడిన ఉన్నత విద్యను అందిస్తుందన్నారు.సింగరేణి పాఠశాలలో చదివిన విద్యార్ధులు నేడు వివిధ రంగాలలో రాణిస్తూ,ఉన్నత స్థానాల్లో తమ ప్రతిభను చాటుతు ఎంతో కీర్తి గడిస్తున్నారు అని,వారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి విద్యార్ధులు క్రమశిక్షణ, అంకితభావంతో ఉన్నత చదువులు చదువుతూ,గొప్ప విద్యావంతులుగా ఎదిగి, చదువుకున్న పాఠశాలకు పేరు ప్రతిష్టలు,తీసుకురావాలన్నారు.సింగరేణి పాఠశాల కరెస్పాండెంట్ డిజిఎం ఎస్ రమేశ్ మాట్లాడుతూ,సమయం ఎంతో విలువైనది కాబట్టి సెల్ ఫోన్ లకు,టివి లకు దూరంగా ఉండాలని,సమయాన్ని వృధా చేయకుండా చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.10వ తరగతి పరీక్షలకు సంసిద్ధంగా ఉన్న విద్యార్ధులతో పాటు,వచ్చే సంవత్సరం 10వ తరగతిలో ప్రవేశించనున్న విద్యార్ధిని విద్యార్ధులు కూడా శ్రద్ధగా చదువుతూ,పై చదువులలో జిల్లా స్థాయిలో ప్రధమ శ్రేణి ర్యాంకులు సాధించాలని,గొప్ప విద్యావంతులుగా ఎదిగి తల్లిదండ్రులు కన్న కలలు నిజం చెయ్యాలి అన్నారు. సమాజానికి,దేశానికి స్ఫూర్తిదాయకమైన సేవలు అందించాలి అన్నారు.సింగరేణి పాఠశాల హెచ్ఎం ఈజిఎస్ స్వరూప రాణి మాట్లాడుతూ, 100% ఫలితాలతో పాటు వంద శాతం – 10/10 ఉత్తీర్ణత సాధించాలని అన్నారు.ఈ సందర్భంగా 58 మంది 10వ తరగతి విద్యార్ధులకు అతిధులచే హాల్ టికెట్,పరీక్ష సామాగ్రిని అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ కల్యాణి, ఎన్ అనురాధ,ఎం కృష్ణబాబు, ఉపాధ్యాయులు,సిబ్బంది,విద్యార్ధులు తదితరాలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !