మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం
కొత్తగూడెం బార్ అసోసియేషన్, అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా ఎన్నికైన రమేష్ కుమార్ మక్కడ్ దుండ్ర రమేష్ లను జిల్లా క్రీడా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా టైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ఇ .మొగిలి మాట్లాడుతూ విద్యార్థి దశలో క్రీడల పట్ల ఎంతో ఆసక్తితో అనేక క్రీడా కార్యక్రమాల్లో పాల్గొని, అనేక బహుమతులు గెలుపొంది వారు లాయర్లుగా సేవ చేస్తూ బార్ అసోసియేషన్ లకు ప్రతినిధులుగా ఎంపిక అవడం సంతోషకరమని క్రీడలకు కూడా వారి సహాయ సహకారాలను అందజేయాల్సిందిగా క్రీడా సంఘాల ప్రతినిధులు వారిని కోరారు. సందర్భంగా రమేష్ కుమార్ మక్కడ్ మాట్లాడుతూ ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ వంతు ప్రోత్సాహం అందిస్తామని కొత్తగూడెంలో జరిగే పలు క్రీడా కార్యక్రమాలకు సహాయ సహకారం అందించడంతోపాటు క్రీడా కార్యక్రమాల నిర్వహణలో భాగస్వాములు అవుతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో నేతాజీ వ్యాయామశాల శిక్షకులు కే కృష్ణారావు, జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, పి .కాశీ హుస్సేన్, పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు శిక్షకులు క్రీడాకారులు పాల్గొన్నారు.