మన్యం న్యూస్ గుండాల..ఉమ్మడి గుండాల మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నిధులను విడుదల చేశారు. గుండాల మండలంలోని చెట్టుపల్లి గ్రామం నుండి కుంచా వారి గుంపు వరకు బీటి రోడ్డు కొరకు1 కోటి 5 ఐదు లక్షల రూపాయలు, ఆళ్లపల్లి మండలం కిచ్చనపల్లి నుండి రాఘవాపురం రోడ్డు కు2 కోట్ల 55 లక్షలు, అనంతోగు గ్రామం నుండి ఆశ్రమ పాఠశాల వరకు 45 లక్షల రూపాయలు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు విడుదల చేశారు. ఉమ్మడి మండలాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఉమ్మడి గుండాల మండలాన్ని దత్తత తీసుకున్న రీతిలో నిధులు కేటాయిస్తున్న ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు. ఉమ్మడి మండల ప్రజల నుండి పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి .
