మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు మండల పరిధిలోని సుదిమళ్ళ రైతువేదిక నందు మంగళవారం ఐసీడీఎస్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన పోషణ పక్షం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గర్భిణీ స్త్రీలు పౌష్ఠిక ఆహారం తీసుకోవడం వల్ల వారితో పాటుగా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందన్నారు.గ్రామాలలో పౌష్ఠిక ఆహారం లోపంలేని పిల్లలను తయారు చేయడం కోసం ఐసీడీఎస్ వారు విశేషంగా కృషిచేయడం అభినందనీయం అన్నారు.మహిళలు ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలు తీసుకోవడంవల్ల రక్తహీనత సమస్య అధిగమించవచ్చు అని సూచించారు.కార్యాక్రమంలో వారివెంట స్థానిక సర్పంచ్ కల్తీ పద్మ,ఎంపీటీసీలు మండల రాము,పూనెంసురేందర్, నాయకులు బోళ్ళ సూర్యం,ప్రసన్న కుమార్ యాదవ్, కుంటా రాజు, సత్తి,ఐసీడీఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు
