మన్యం న్యూస్, పినపాక:
పినపాక మండలంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనానికి స్థలాన్ని బీఆర్ఎస్ నాయకులు మంగళవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ ముదునూరి రవి శేఖర్ వర్మ, మాజీ వైస్ ఎంపీపీ దాట్ల వాసు బాబు, సర్పంచ్లు మొగిలిపల్లి నరసింహారావు, గొలుసుల నాగేశ్వరరావు, ఉపసర్పంచ్ రాయల సత్యనారాయణ, అమరవరం ఎంపిటిసి ఖాయం శేఖర్, సొసైటీ డైరెక్టర్ పొనుగోటి కామేశ్వరరావు, సీనియర్ నాయకులు సాగీరాజు వీరభద్రరాజు( బుల్లిబాబు), బోడ ఈశ్వర్, ఎడ్ల కుమార్, యూత్ నాయకులు గాండ్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు.