మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మి నారాయణ మంగళవారం బి ఆర్ ఎస్ ఆత్మీయ సమావేశం ను ఉద్దేశించి మంగపేట మండలం లో జరిగే బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, దీనికి ప్రతి కార్యకర్త క్రియాశీల పాత్ర పోషించాలని అన్నారు. మంగళవారం మంగపేట మండలం రాజుపేట లో అన్ని గ్రామఅధ్యక్షులు పార్టీ సీనియర్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీనారాయణ ఏప్రిల్ 3వ, తేదీన రాజుపేట గ్రామంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
శ్రీమతి సత్యవతి రాథోడ్ మాజీ ఎమ్మెల్సీ ఆత్మీయ సమ్మేళన ములుగు జిల్లా ఇన్చార్జి ఆరికేల నర్సిరెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ నియోజకవర్గం ఇంచార్జ్ కుసుమ జగదీష్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ తుమ్మ మల్లారెడ్డి, జిల్లా రైతు బంధు సభ్యులు పచ్చ శేషగిరిరావు , మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మాజీ జడ్పీటీసీ సిద్ధంశెట్టి వైకుంఠం, జిల్లా వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు, మండల నాయకులు యడ్లపల్లి నర్సింహారావు, పోలిన హరిబాబు, చిట్టీమల్ల సమ్మయ్య, మాలికంఠ శంకర్, లోడంగి లింగయ్య,చల్లగురుగుల తిరుపతి, అయూబ్,రాయసాహెబ్ ,రాజ మల్ల సుకుమార్, కె నర్సన్న , మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరాస్వామిమైనార్టీ మండల అధ్యక్షులు అఫ్జల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు తోలేం నర్సింహా రావు,నాగేందర్, దిద్ది శ్రీను, వెంకట్ నారాయణ, మూగల రమేష్, ఏకాంతం, శ్రీను,మహిళలు కాటూరి సుగుణ, పార్వతి,అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, తుక్కని శ్రీనివాస్, నూనె లింగయ్య, రావుల రమణ, గొల్లపెల్లి శ్రీను, చిట్టీమల్ల బాలు,ఉడుగుల శ్రీనివాస్ యాదవ్ , సాంబులు, చంద్రరావు, చదలవాడా సాంబాశివరావు,సోయం సీతయ్య తదితరులు పాల్గొన్నారు.