UPDATES  

 నవమి, మహాపట్టాభిషేకం వేడుకలకు వైభవోపేతంగా ఏర్పాట్లు..

  • నవమి, మహాపట్టాభిషేకం వేడుకలకు వైభవోపేతంగా ఏర్పాట్లు
  •  – ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులు
  •  – ప్రతి భక్తుడికి తలంబ్రాలు అందించేందుకు 70 కౌంటర్లు
  •  – జిల్లా కలెక్టర్ అనుదీప్

 

మన్యం న్యూస్, భద్రాచలం :

 

శ్రీరామనవమి మహాపట్టాభిషేకం వేడుకలు రంగ రంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. మంగళవారం స్వామివారి వేడుకలు జరగనున్న మిథిలా స్టేడియంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కళ్యాణ వేడుకలు వీక్షణకు 26 సెక్టార్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతి సెక్టార్లు భక్తులకు సౌకర్యాలు కల్పనకు ప్రత్యేక అధికారులను నియమించామని చెప్పారు. ప్రతి సెక్టార్ లో భక్తులకు మజ్జిగ, మంచినీరు, బిస్కెట్ ప్యాకెట్లు అందజేయనున్నట్లు చెప్పారు. భక్తులు కల్యాణ వేడుకలు వీక్షించడానికి వీలుగా ప్రతి సెక్టార్లో ఎల్ఈడి టీవీలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తులు ఒక సెక్టార్ నుండి మరొక సెక్టార్ కు వెళ్లకుండా పటిష్ట పర్యవేక్షణ చేయాలని సెక్టారు అధికారుకు సూచించారు. కల్యాణ వేడుకలు కమనీయంగా వీక్షించుటకు కాను ప్రత్యేక అధికారుల విధులు ఎంత ప్రత్యేకమైనవని తెలిపారు. మహోత్సవాలకు వచ్చే భక్తులు మన అధితులని, వాళ్ళకు ఎలాంటి అసౌకర్యం చూడాల్సిన బాధ్యత మనందరిపైందని చెప్పారు. అందరి సమిష్టి కృషితో వేడుకలను విజయవంతం చేయాలని ఆయన సూచించారు. తలంబ్రాలకు ఎంతో ప్రత్యేకత ఉన్నందున, ప్రతి భక్తులకు తలంబ్రాలు అందించేందుకు 70 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సెక్టార్ లో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరుగకుండా అగ్నిమాపక వహనాలతో పాటు ఫైర్ఎస్టింగ్విష్ లను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. ఏదేని అగ్నిప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై మాక్ డ్రిల్ నిర్వహించి సిబ్బందికి, సెక్టార్ అధికారులకు అవగాహన కల్పించారు. ప్రతి సెంటర్లో నాలుగు ఫైర్ ఎస్టింగ్విష్ లను నలుమూలలా అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర వైద్య సేవలకు అంబులెన్స్ లను కళ్యాణమండపంలో అందుబాటులో ఉంచాలని చెప్పారు. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య కేంద్రాన్ని పరిశీలించారు. అత్యవసర మందులను, ఓఆర్ఎస్ పాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. సిపిఆర్ సేవలు అందించుటకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. భక్తులకు 3 లక్షల మంచినీరు ప్యాకెట్లు, లక్ష మజ్జిగ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. స్వామి వారు కళ్యాణ మండపానికి వచ్చే సమయంలో భక్తుల రద్దీ లేకుండా పట్టిష్ట భారికేడింగ్ ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించాలని ఆయన సూచించారు. భక్తులు వ్యర్ధాలను ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో మాత్రమే వేయాలని చెప్పారు. స్వచ్ఛ శ్రీరామనవమి వేడుకలు నిర్వహణకు ప్రతి ఒక్కరు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమీషనర్ అనిల్ కుమార్, ఎస్పీ డాక్టర్ వినీత్, దేవస్థానం ఈఓ రమాదేవి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !