మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 28: మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రినీ వితరణ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సబ్ ఇన్స్పెక్టర్ ఎస్.కె షాహినా పాల్గొని వారి చేతుల మీదుగా 8 రకాలతో కూడిన పరీక్ష కిట్లు పంపిణీ చేశారు.అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ షాహిన మాట్లాడుతూ పరీక్ష సమయంలో విద్యార్థులు ఎటువంటి ఒత్తిడిలకు లోను కాకూడదని ఇష్టంతో చదివి మంచి మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని అన్నారు.అనంతరం ఫ్రెండ్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సిహెచ్ శ్రీకాంత్ మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా కరోనా సమయంలో పేదవారికి ఫుడ్ డొనేషన్,బ్లడ్ డొనేషన్,క్యాంపు లు వంటి సామాజిక సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ పదవ తరగతి విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ పి.కవిత,పాఠశాల సిబ్బంది,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు





