UPDATES  

 కళ్యాణానికి వచ్చే భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలి కలెక్టర్ అనుదీప్….

మన్యం న్యూస్ దుమ్ముగూడెం::

పర్ణశాలలో జరిగే సీతారాముల కల్యాణానికి హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు కల్పించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు సీతారాముల కళ్యాణానికి పర్ణశాలలో అంతంత మాత్రం ఏర్పాట్లు చేపడుతున్నారని ఆ ఏర్పాట్లు కూడా నత్తనడకన జరుగుతున్నాయని గత రెండు రోజుల నుంచి పలు వార్త పత్రికలలో కథనాలు వెలువబడుతుండడంతో స్పందించిన కలెక్టర్ సీతారాముల కల్యాణానికి పర్ణశాలలో పలు శాఖల అధికారులు చేపడుతున్న పనులను పరిశీలించేందుకు మంగళవారం పర్ణశాలను సందర్శించారు ఈ సందర్భంగా కళ్యాణం నిర్వహించే కళ్యాణమంటపం ప్రాంతాన్ని తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మిస్తున్న ప్రాంతాన్ని స్థాన ఘట్టాల ప్రాంతాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణం జరిగే కళ్యాణ మండపం వద్ద భక్తులకు అందుబాటులో నాలుగు త్రాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేయాలని కళ్యాణాన్ని భక్తులు తిలకించేందుకు లైటింగ్ మైకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు గోదావరి నదిలో సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కరకట్ట నిర్మాణం చేపడుతున్నందున ఆ ప్రాంతంలోకి భక్తులనెవ్వరిని వెళ్లకుండా చూడాలని భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా కేవలం మూడు అడుగుల లోతులోనే స్నానాలు చేసేటట్లుగా భారీకేడ్లు నిర్మించి గజ ఈతగాలను ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు  భక్తుల కోసం 20 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు పని ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని నీటిపారుదల శాఖ అధికారులను ఈ సందర్భంగా మందలించగా మంగళవారం సాయంత్రం లోగా పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ అధికారులు కలెక్టర్కు తెలిపారు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించిన ఆయన అవసరమైన మందులను అన్ని ముందుగానే సిద్ధపరచుకోవాలని ఓ ఆర్ ఎస్ పాకెట్లను ఎక్కువ ఏర్పాటు చేయాలని ఆదేశించారు భద్రా భద్రాచలం నుండి పర్ణశాలకు వచ్చే భక్తులకు రోడ్డు రవాణా సంస్థ ద్వారా విస్తృతంగా బస్సులు నడిపి భక్తులకు ఎటువంటి ప్రయాణ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు పర్ణశాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు అందించేందుకు విస్తృతంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని నిత్యం పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని దీంతోపాటు చెత్త వేరే ఎందుకు ప్రస్తుతం ఉన్న20 కార్మికులతోపాటు మరో 15 మంది కార్మికులను అదనంగా ఏర్పాటు చేసుకొని  చెత్త అనేది కనిపించకుండా చూడాలని ఈ మూడు పనులు గ్రామపంచాయతీ నుంచి పగడ్బందీగా చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ రెడ్డిని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ ని పర్ణశాల ఆలయంలోకి తీసుకు అధికారులు వెళ్లేందుకు ప్రయత్నించగా కలెక్టర్ దానికి నిరాకరించారు ఈ నెల 31వ తేదీన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై  సౌందర్య రాజన్ పర్ణశాలను సందర్శించనున్న సందర్భంగా బస్టాండ్ నుండి ఆలయం వరకు గల మార్గంలో ఉన్న చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించాలని దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రమాకాంత్ రెడ్డి దుమ్ముగూడెం తహసిల్దారు చంద్రశేఖర్ ఎంపీడీవో చంద్రమౌళి నీటిపారుదల శాఖ అధికారులు మిషన్ భగీరథ అధికారులు లతోపాటు పలు ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !