మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
పర్ణశాల సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీరామనవమి మహోత్సవంలో భాగంగా మూడవరోజు అగ్ని ప్రతిష్ట ధ్వజరోహణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు సంతానం లేని వారికి గరుడ పూజా కార్యక్రమం నిర్వహించడం ద్వారా సంతానం కలవడం కోసం దంపతులకు ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి తిరువీధి సేవా కార్యక్రమం ఊరేగింపు నిర్వహించి బేరి పూజ స్వామి వారి కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు ఈ పూజా కార్యక్రమం కి భక్తులు దంపతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.