- దేశ ప్రజలకు ద్రోహం చేస్తున్న బిజెపిని గద్దెదించాలి
- ఎన్నికల హామీలు అమలు చేసి కేసీఆర్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలి
- పాలకులను ప్రశ్నించేందుకే ఏప్రిల్ 14 నుంచి ‘సిపిఐ ప్రజాచైతన్య యాత్ర’లు
- సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశానికి ప్రమాదకరంగా మారిందని, దీన్ని నియంత్రించి గద్దె దించేందుకు ప్రతిపక్షాలు ఏకమై దేశాన్ని పరిరక్షించుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా కార్యాలయం శెషగిరిభవన్లో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం గుత్తుల సత్యనారాయణ అధ్యక్షతన బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ దేశంలోని మోడీ ప్రభుత్వం రపజాస్వామ్య వ్యవస్థతోపాటు ఫెడరిలిజాన్ని పూర్తిగా నాశనం చేయడానికి పూనుకుందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ వారిపై ఉక్కుపాదం మోపుతోందని ఆరోపించారు. ప్రతిపక్షాలను అణచివేయాలనే కుట్రలతోనే వారిపై అవినీతి ఆరోపణలు రుద్దుతూ ఈడీ, సిబీఐ, ఇన్ కంటాక్స్ సంస్థలతో కేసులు పెట్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొడుతూ పబ్బంగడుపుకుంటోందన్నారు. జాతీయ సంపదను కార్పోరేట్లకు పంచిపెడుతూ దేశాన్ని అదోగతిపాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ప్రతిపక్షాలు, ప్రజలు ఎకం కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపిని కాలుమోపకుండా చేసేందుకే ఏప్రిల్ 14 నుంచి నెలరోజులపాటు భద్రాది జిల్లాలో చేపడుతున్న ప్రజాచైతన్య యాత్రలు, ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెల్లి చైతన్యవంతం చేయాల్సిన భాద్యతను కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. *సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య, రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ* రెండు దఫాలుగా గద్దెనెక్కిన కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకంలో వైఫల్యం చెందడంతో గృహలక్ష్మి పథకం పేరుతో రూ. 3లక్షలు ఇస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఈ పథకానికి సంబందించి విధివిధానాలు ప్రకటించకపోవడం సరైంది కాదన్నారు. కమ్యూనిస్టు పార్టీల పోరాటంతో పోడు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్కు పట్టాలు జారీ చేసేందుకు ఇంకెంతకాలం పడుతుందో సమాదానం చెప్పాలన్నారు. జిల్లాలో దరఖాస్తు చేసుకున్న 2,99,748 ఎకరాలకు పోడు పట్టాలు అందించాలని, జిల్లాలో నిర్మిస్తున్న సీతారామా ప్రాజెక్టుకు సంబందించి ఆయకట్టు పెంచి జిల్లా రైతాంగానికి మేలు చేయాలని, ప్రగళ్ళపల్లి, రోళ్ళపాడు, పులుసుబొంత ప్రాజెక్టులను తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన పేదలందరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేసి కేసీఆర్ తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు బందెల నర్సయ్య, ముత్యాల విశ్వనాధం, సరెడ్డి పుల్లారెడ్డి, కల్లూరి వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మి కుమారి, ఏపూరి బ్రహ్మం, ఎస్.సలీమ్, నరాటి ప్రసాద్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, యార్లగడ్డ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.