మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లి మార్చి 29 : మండల పరిధిలోని మర్రిగూడేం గ్రామ పంచాయితీలో బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా సూపర్వైజర్ గంగాజలం అధ్యక్షతన గర్భిణీలకు చిరుధాన్యాలపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎర్రగుంట పిహెచ్సి వైద్యాధికారినీ తన్మయి పాల్గొన్నారు.అనంతరం సూపర్వైజర్ గంగాజలం మాట్లాడుతూ చిరుధాన్యాలు గర్భిణీలు తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా వుంటుందని ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల గర్భిణీలకు ఆరోగ్యానికి మేలు కలగడమే కాకుండా కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా వుంటుందని చెప్పారు.ఈ చిరుధాన్యాల వల్ల అనేక ప్రయోజనాలు కలుగతాయనీ ఆమె అన్నారు.అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు జరిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వి.గోపాలరావు,అంగన్వాడి సూపర్వైజర్ జి.అరుణ,హెచ్ఎస్ నాగేశ్వరరావు,ఏఎన్ఎం లక్ష్మి,అంగన్వాడి టీచర్లు రమాదేవి,నరసమ్మ,రాధ,కుమారి,తదితరులు పాల్గొన్నారు.