- పినపాక మండలానికి రహదారులు…
- గిరిజన సంక్షేమ శాఖ నిధులతో కేటాయింపు…
- రైతన్నలకు ఆసరాగా లింకు రహదారులు…
- రేగా కాంతారావుకు ధన్యవాదాలు తెలుపుతున్న మండల ప్రజానీకం…
- పాత్రికేయుల సమావేశంలో వెల్లడించిన మండల అధ్యక్షుడు పగడాల…
మన్యం న్యూస్, పినపాక:
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు కృషితో, గిరిజన సంక్షేమ శాఖ నుంచి సుమారు 20 కోట్ల రూపాయల నిధులతో పినపాక మండలంలోని వివిధ గ్రామాలను కలుపుతూ బీటీ రోడ్డు నిర్మాణాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ, పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు సుపరిపాలనలో ముందడుగు వేస్తుందని అన్నారు. తాజాగా ఆయన అభివృద్ధిలో భాగంగా పినపాక మండలానికి ముఖ్యమంత్రి ఆశీస్సులతో గిరిజన సంక్షేమ శాఖ నిధులనుండి 10 బీటీ రోడ్డులను మంజూరు చేయించారన్నారు. ఈ రోడ్డు నిర్మాణాల కారణంగా ఆదివాసీ గ్రామాలకు సైతం వర్షాకాలంలో రహదారుల సమస్యలు ఉండవని, రైతన్నలకు వారి పొలాలకు చేరుకోవడానికి వీలుగా లింకు రహదారులు ఉపయోగపడుతున్నాయని తెలియజేశారు. మండలంలోని వివిధ ప్రాంతాలకు కేటాయించిన బీటి రోడ్డు వివరాలు ఇలా ఉన్నాయి. అమరారం-జిన్నెలగూడెం రహదారికి రూ. 75 లక్షలు, గొట్టెల్ల- చినరాజుపేట రహదారికి రూ.1.50 కోట్లు, గొట్టెల్ల- ఎల్చిరెడ్డిపల్లి రహదారికి రూ. 1.35 కోట్లు, మల్లారం- వెంకటేశ్వరపురం రహదారికి రూ.4 కోట్లు, పాత రెడ్డిపాలెం- చింతల బయ్యారం రహదారికి రూ.1.87 కోట్లు, రెడ్డిగూడెం- టీ కొత్తగూడెం రహదారికి రూ. 6.75 కోట్లు, దేవనగరం- సింగిరెడ్డిపల్లి రహదారికి రూ.75 లక్షలు, జానంపేట – అమరారం రహదారికి రూ.75 లక్షలు, జానంపేట ఆర్ అండ్ బి రోడ్డు నుంచి సాయి నగర్ రహదారికి రూ.1.5కోట్లు, అమరారం – తిర్లాపురం రూ. 1.5కోట్లు మంజూరైనట్లు తెలియజేశారు. పినపాక నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా ఈ నిధులను కేటాయించిన ఎమ్మెల్యే రేగా కాంతారావుకు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, సొసైటీ చైర్మన్ రవి వర్మ, జడ్పిటిసి దాట్ల సుభద్రాదేవి వాసు బాబు, పోలిశెట్టి సత్తిబాబు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు, ముక్కు వెంకటేశ్వర్ రెడ్డి, బుల్లి బాబు, కటకం గణేష్, వడ్లకొండ శ్రీనివాసరావు, చిన్నారి, కోడం నరసింహారావు, గాండ్ల అశోక్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.