మన్యం న్యూస్,ఇల్లందు టౌన్: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇల్లందు నియోజకవర్గ ప్రజలకు ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యురాలు బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ మాట్లాడుతూ.. భార్యాభర్తల అపురూప అన్యోన్య దాంపత్యానికి అద్దం పట్టే ఆ భద్రాద్రి రాముని దివ్య ఆశీస్సులు ఇల్లందు నియోజకవర్గ ప్రజలందరి మీద ఉండాలని, భద్రాద్రి రామయ్య స్వామి ఆశీస్సులతో ఇల్లందు నియోజకవర్గం సుభిక్షంగా పాడిపంటలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆకాంక్షించారు.