మన్యం న్యూస్,చండ్రుగొండ మార్చి 29: మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉండేటి ఆనంద సమక్షంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల మధ్య ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా జెడ్పిటిసి కొనగండ్ల వెంకట్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి సత్తెనపల్లి సత్యనారాయణ,విశిష్టగా అతిధిగా ప్రముఖ విద్యావేత్త,కవి,రచయిత సామాజికవేత్త,జనవిజ్ఞాన వేదిక ఉమ్మడి రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ సిఏ ప్రసాద్ పాల్గోన్నారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జెడ్పిటిసి వెంకట రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు భారత దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలని తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనీ అన్నారు.విద్యార్థులకు పరీక్షల పట్ల అవగాహన కలిగించడంతోపాటు,భావి భారత పౌరులుగా ఎలా ఎదగాలో తెలియజేశారు.అదేవిధంగా విద్యార్థులు బాగా చదివి పరీక్షలలో మంచి ర్యాంకులు సాధించి పాఠశాలకు,మండలానికి మంచి పేరు తీసుకురావాలని,అలాగే తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని తెలియజేశారు.అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ 2022-23 సంవత్సరమున పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు వివిధ మండల,జిల్లా,రాష్ట్ర స్థాయిలలో నిర్వహించిన వివిధ అంశాలలో బహుమతులను సాధించారని,8వ తరగతి ముగ్గురు విద్యార్థులు నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ ను సాధించారని,ఒక విద్యార్థి ఇన్స్పైర్ అవార్డును సాధించారని,జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో మన పాఠశాల మొదటి బహుమతిని సాధించిందనీ,రాష్ట్ర స్థాయిలో కూడా అనేక పోటీలలో పాల్గొని బహుమతులు సాధించి పాఠశాలనీ,మండలాన్ని ఉన్నత శిఖరాలలో నిలిపారని తెలియజేశారనీ అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ఆర్.శ్రీనివాస్ రెడ్డి,ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు,బోధన సిబ్బంది కాంప్లెక్స్ సి ఆర్,విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు