మన్యం న్యూస్ చండ్రుగొండ మార్చి29:రాష్ట్ర ప్రభుత్వం పేదలను ఆదుకోవాలనే ఉన్నత లక్ష్యం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ అన్నారు. బుధవారం తిప్పనపల్లి పంచాయతీలో తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆద్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కళాజాత నిర్వహించారు. కంటివెలుగు, హరితహరం, పరిసరాల పరిశుభ్రత, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కళాకారులు కళాజాత ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా రసూల్ మాట్లాడుతూ…అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు షేక్ మూసా, కౌసర్, నందు, జాను, వెంకటేశ్వర్లు, వెంకన్న, గురవమ్మ, కుమారి, ధనలక్ష్మి, బాలక్రిష్ణ, రవిబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు.