మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
శ్రీరామనవమి, మహా పట్టాభిషేకం మహోత్సవాల నిర్వహణకు సర్వాంగ సుందరంగా ముస్తాబైన భద్రాద్రి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం భద్రాచల పుణ్యక్షేత్రంలో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
బుధవారం ఉదయం నుంచే భద్రాచలానికి
భక్తుల రాకడ ప్రారంభమైనట్లు ఆయన మిథిలా స్టేడియంలో ఏర్పాట్లును ఆయన పరిశీలించారు.
భక్తుల రద్దీతో కోలహలంగా భద్రాచలం ఉన్నదనిచెప్పారు. ఉదయం నుంచి భద్రాచలానికి భక్తుల రద్దీ ప్రారంభమైనదని . జిల్లా యంత్రాంగం సేవలో నిమగ్నమైనట్లు చెప్పారు.
ప్రతి భక్తుడు వేడుకలు వీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. వేడుకలు వీక్షణకు ప్రతి
సెక్టార్ లో ఎల్ ఈ డి లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
సెక్టార్లలో భక్తులకు మంచినీరు,మజ్జిగ, బిస్కెట్స్ ఉచిత పంపిణీ చేస్తూన్నట్లు ఆయన తెలిపారు.
సేవలు పర్యవేక్షణకు ప్రతి సెక్టార్ కు ప్రత్యేక అధికారులు కేటాయింపు చేసినట్లు తెలిపారు.
వైద్య సేవలు నిర్వహణకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో పాటు అత్యవసర కేంద్రాల్లో మందులు, ఓఆర్ఎస్ పాకెట్లు,
అంబులెన్స్ లు, సిపిఆర్ సేవలు సిద్ధంగా ఉంచామన్నారు. భక్తులకు సమాచారం అందించుటకు ప్రధాన కూడళ్ళలో సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సమాచార కేంద్రంలో స్వామి వారి సేవలు, బస్సులు, రైళ్లు, అత్యవర వైద్య కేంద్రాలు, తలంబ్రాలు, ప్రసాదాల కౌంటర్లు వివరాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు.
ఏదేని అత్యవసర సేవలకు భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444 కంట్రోల్ రూము ఏర్పాటు చేశామని భక్తులు ఫోన్ ద్వారా సహాయం పొందాలని చెప్పారు.భక్తులు జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ డా వినీత్, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఈఓ రమాదేవి అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.