మన్యం న్యూస్ సారపాక.. భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెట్ ఆధ్వర్యంలో భద్రాద్రి జల ప్రసాదం పేరుతో ఏర్పాటు చేసిన 6 ఉచిత మంచి నీటి ప్లాంట్ లను దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. దివిస్ లాబొరేటరీస్ వారు సుమారు 6 కోట్ల 34 లక్షలతో తెలంగాణలోని ప్రముఖ ఆలయాల్లో 37 మంచి నీటి ప్లాంట్ లను ఏర్పాటు చేసారని, ఒక యాదాద్రి లోనే 17ప్లాంట్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దివిస్ లాబొరేటరీస్ వారికి భగవంతుడి కృపాకటాక్షాలు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. దేవాలయాల్లో దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్,ఆలయ ఈవో రమాదేవి, దివిస్ సభ్యులు శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.