మన్యం న్యూస్ నూగురు వెంకటాపురం
వెంకటాపురం మండల కేంద్రంలో జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ నందు బుధవారం పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది,.. మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఎన్నో వేల మంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి వెళ్తూ ఉంటారని ఎంతోమంది ఉత్తీర్ణత సాధించి మంచి మార్కులతో మంచి ర్యాంకులు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తున్నామన్నారు విద్యార్థులు అందరూ పరీక్షలన్నీ ముగించుకొని వారు వెళుతూ ఉంటే త మ కు చాలా బాధగా ఉoదని విద్యార్థుల మీద వారి ప్రేమను వ్యక్తపరిచారు. అలాగనే విద్యార్థులు వారి ఉపాధ్యాయులపై ఎంతో కాలం నడిచిన ఈ అనుబంధాన్ని మరవలేక పోతున్నామని ఎంత స్థాయికి వెళ్లిన తమ గురువుల్ని గుర్తుపెట్టుకుని గురువులను తల ఎత్తుకునే విధంగా గొప్ప స్థాయికి వెళ్తామని విద్యార్థులు తెలియజేశారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పిల్లలకు మంచి పునాది ఇవ్వడంలో100% కృషి చేశామని వారు గొప్పఎత్తులకు ఎదిగి తమ పేరుని నిలబెట్టాలని వారి ఆశ భావం వ్యక్తపరిచారు . అనంతరం నృత్యాలతో, గీతాలతో, స్లామ్ పుస్తకాలతో, ఒకరికొకరు ఉండిపోయేలా విద్యార్థులు తమ తమ భావాలను వ్యక్తపరచుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ తిరుపతిరావు, సీఐ శివ ప్రసాద్, స్కూల్ ఉపాధ్యాయులు, సీనియర్ రాజకీయవేత అచ్చ నాగేశ్వరావు,, స్కూల్ చైర్మన్ యనమల జయరాజ్, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు