UPDATES  

 సమ్మక్క, సారక్క దేవాలయంలో తిరుగువారం పూజలు.. ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ..

మన్యం న్యూస్, పినపాక:

పినపాక మండలం సింగిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ లోని దేవనగరం గ్రామంలో వెలిసిన  సమ్మక్క, సారక్క బద్ది పోచమ్మ దేవాలయంలో గతవారం జాతర జరుగగా తిరుగువారం ప్రత్యేక పూజలు బుధవారం నాడు చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ  హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు .  ఆలయ కమిటీ తోలెం వంశీయులు ఎంపీపీ గుమ్మడి గాంధీని, సర్పంచుల అధ్యక్షుడు మొగిలిపల్లి నర్సింహారావుని ఎంపిటిసి ఖాయం శేఖర్ ని శాల్వాతో సత్కరించారు.  ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దేవరబాల తోలెం నాగయ్య, రాంబాబు ,శ్రీను, రవీందర్, జనార్ధన్, గోవర్ధన్, ఆలయ పూజారులు మద్దెల పటేల్ తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !