మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఛాంపియన్షిప్ మండలానికి చెందిన ఆదివాసీ ఉపాధ్యాయుడు కల్లూరి భద్రయ్య జాతీయస్థాయిలో మూడో బహుమతి సాధించారు వృత్తిపరంగా ఉపాధ్యాయ ఉద్యోగం చేస్తూ చిన్నతనం నుంచే క్రీడలపై ఇష్టంతో అథ్లెటిక్స్ లో జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయస్థాయిలో పలు విభాగంలో ఎన్నో అవార్డును గెలుచుకున్నారు. సివిల్ సర్వీస్ అథ్లెటిక్స్ లో 2023 సంవత్సరానికి గాను ఈ నెల 27న మహారాష్ట్రలోని పూణే జరిగిన ఈ లాంగ్ జంప్ విభాగంలో జాతీయ స్థాయిలో మూడో బహుమతి సాధించారు సింగవరం గ్రామానికి చెందిన భద్రయ్య ఎస్జిటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నాగన్న గుంపులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా తెలంగాణ రాష్ట్రం తరఫున జాతీయస్థాయిలో మూడో స్థానం గెలుపొందిన కల్లూరి భద్రయ్యకి పలువురు మండల ఉపాధ్యాయులు ఏటిఏ రాష్ట్ర అధ్యక్షులు కల్లూరు జయ బాబు, వాసం ఆదినారాయణ పూనెం రమేష్ అభినందనలు తెలిపారు.