మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రమణక్క పేట అంగన్వాడీ కేంద్రం లో పోషణ పక్షం సూపర్ వైజర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిధిగా డిడబ్ల్యూఓ ప్రేమలత,ఏటూరునాగారం సిడిపిఓ హేమలత హాజరు అయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పోషణ పక్షం అంటే చిరుధాన్యాలతో కూడిన ఆహరం, వాటిని గర్భిణీ స్త్రీలు బాలింతలు తీసుకోవాలి అని సూచనలు చేశారు. చిరుధాన్యాలు అయిన రాగులు, కొర్రలు, సామలు, ఊదులు, అండు కొర్రలు, సజ్జలు, జొన్నలు ఇటువంటి ధాన్యాలు చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి, ఇటువంటి ఆహరం తీసుకోవడం వలన గర్భిణీ స్త్రీలు, బాలింతలు బలంగా ఉంటారు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యం గా ఉంటారు అని తెలియజేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం లో చిరుదాన్యాల ప్రాధాన్యత తల్లులకు,గర్భిణీ స్త్రీలకు అర్ధం అయ్యేలా వివరించాలి, చిరు ధాన్యాలు ప్రతి ఒక్కరూ తీసుకొనేలా అంగన్వాడీ టీచర్స్ ప్రజలను చైతన్యవంతులను చేయాలనీ సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో డిడబ్ల్యూఓ ప్రేమలత, సిడిపిఓ హేమలత, సూపర్ వైజర్ విజయలక్ష్మి, మల్లూరు సెక్టార్ పరిధిలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల టీచర్స్ హాజరు అయ్యారు.