మన్యం న్యూస్, మణుగూరు, మార్చి29: పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తూ ఎన్నో నిధులు తీసుకొస్తున్నారని, ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రజల గుండెల్లో నిలిచిపోతారని నలుగురు జడ్పిటిసి పోశం నరసింహారావు అన్నారు. ఆయన బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నిర్వహించ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మణుగూరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు సుమారు 50 కోట్లను నిధులు కేటాయించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మణుగూరు అభివృద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం ఇదే మొట్టమొదటిసారని, మణుగూరుపట్ల మణుగూరు అభివృద్ధి పట్ల ఎమ్మెల్యే రేగాకి ఉన్న శ్రద్ధ ఈ నిధులు కేటాయించడంతో అర్థమవుతుందన్నారు. ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన మాట కు కట్టుబడి నిధులు తీసుకురావడంలో ఆటంకాలు ఎదురైన, రాజకీయ ఒత్తిడిలు వచ్చినా ఎదుర్కొని ప్రజలు, అభివృద్ధి ముఖ్యమని నిధులు తీసుకొని వచ్చి సిసి రోడ్లు, బిటి రోడ్లు, సైడ్ డ్రైన్లు, సెంట్రల్ లైటింగ్, మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు, ఆదివాసి గ్రామాలకు రహదారి సౌకర్యాల కోసం నిధులు తీసుకు రావడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో తెలియజేశారు ఈ సమావేశంలో ఎంపీపీ కారం విజయకుమారి, పిఎసిఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఎంపిటిసి సభ్యులు గుడిపూడి కోటేశ్వరరావు, మచ్చ సమ్మక్క, కో-ఆప్షన్ జావిద్ పాషా, సర్పంచులు ఏనిక ప్రసాద్, రజిత, కొమరం జంపేశ్వరి, పాలంచ ఈశ్వరమ్మ, గనిబోయిన కృష్ణవేణి, కురుసం రాంబాబు, ప్రభుదాసు, కమటం సురేష్ తదితరులు పాల్గొన్నారు