మన్యం న్యూస్,ఇల్లందుటౌన్:కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు బుధవారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ జీరో వ్యర్థ దినోత్సవంలో భాగంగా వ్యర్థ రహిత నగరాల కోసం నిర్వహించిన కార్యక్రమంలో ఇల్లందు పురపాలక ఛైర్మెన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఆహ్వానం అందుకొని కార్యక్రమంలో సిడిఎంఎ కమిషనర్ సత్యనారాయణ ఐఏఎస్ తో ఇల్లందు మునిసిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పాల్గొనటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి హాజరై దేశవ్యాప్తంగా వ్యర్థ నిర్మూలన కొరకు తీసుకున్నటువంటి చర్యలు మరియు ఉత్తమ పద్ధతుల గురించి తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సీడీఎంఏ కమిషనర్ సత్యనారాయణ ,రూపా మిశ్రా ఐఏఎస్ జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫైర్స్ మరియు చీఫ్ సెక్రటరీ మనోజ్ జోషిలకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు , పిజ్జాలదిగూడ మేయర్ లను పరిచయం చేశారు. కార్యక్రమం అనంతరం డీవీ కేంద్ర పెట్రోలియం మరియు హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ఇల్లందు పట్టణాన్ని మరింత అభివృద్ధి మార్గంలో నడిపించాలని సూచించినట్లు మున్సిపల్ ఛైర్మెన్ డీవీ తెలిపారు.