UPDATES  

 వేధింపులు భరించలేక.. వేధిస్తున్నాడని చంపింది…

  • వేధింపులు భరించలేక
  • వేధిస్తున్నాడని చంపింది.
  • పోలీసుల ఎదుట లొంగిపోయిన యువతి.

మన్యం న్యూస్ ఏటూరు నాగారం

వేధిస్తున్న వ్యక్తిని ఓ యువతి హత్య చేసిన ఘటన ఏటూరు నాగారం మండల కేంద్రంలో మూడో వార్డులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వేధిస్తున్నాడని కారణంతో వ్యక్తికి చేతులు కట్టేసి కత్తితో యువతి పొడిచి హత్య చేసిన సంఘటన.అదే కాలనీకి చెందిన రామటెంకి శ్రీనివాస్ ( 30) అనే యువకుడు వేధిస్తున్నాడని 24 ఏళ్ల జాడి సంగీత హత్య చేయడం స్థానికంగా కలకలం రేపింది.శ్రీనివాస్ కు ఇదివరకే పెళ్లయింది భార్య వదిలేసి వెళ్లిపోయింది.ఈ క్రమంలో ఆ యువకుడు సంగీతను పెళ్లి చేసుకోవాలంటూ వేధింపులకు గురి చేస్తున్నాడు.గతంలో కూడా సంగీత,శ్రీనివాస్ పై అత్యాచార కేసును పెట్టింది. బుధవారం రాత్రి ఇంటికి రాగా చేతులు కట్టేసి కత్తితో పొడిచి హత్య చేసింది.మృతుడు కొంతకాలంగా సంగీతను వేధింపులకు గురి చేస్తున్నాడు. హత్య చేసిన అనంతరం యువతీ స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !