మన్యం న్యూస్, మణుగూరు, మార్చి30: మణుగూరు మండలంలో గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మేళ తాళాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణముల నడుమ పండుగల నిర్వహించారు. భక్తుల రద్దీతో ఆలయాలన్ని కిటకిటలాడాయి. శ్రీరామ నామస్మరణతో ఆలయాలు మారుమోగాయి. అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు రాములోరి కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణం అనంతరం ఆలయాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.