మన్యం న్యూస్,ఇల్లందు టౌన్*ఆర్ అండ్ ఆర్ కాలనీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జి.రవి పాల్గొన్నారు. అనంతరం స్వామివారి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రానున్న ఎన్నికల్లో ఇల్లందులో రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని స్వామివారిని కోరినట్లు డాక్టర్ రవి తెలిపారు. వారితో పాటు పట్టణ కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జీవి భద్రం, మాజీ కౌన్సిలర్ ధారావత్ కృష్ణ, పట్టణ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాణాల శ్రీనివాసరావు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎస్సి సెల్ వైస్ చైర్మన్ బియెన్ గోపాల్, పట్టణ కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఆనంద్, పట్టణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి వాసుదేవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు శేఖర్, రవి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు
