మన్యం న్యూస్, పినపాక:
మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో రాములోరి కల్యాణం గురువారం ఘనంగా నిర్వహించారు. ఆలయాలన్నీ రామ నామస్మరణతో మారుమోగాయి. భక్తులతో కిటకిటలాడాయి. నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.సీతారాముల కల్యాణం పినపాక,జానంపేట, ఈ.బయ్యారం, మల్లారం గ్రామాలలో కనుల పండువగా జరిగింది. కల్యాణ మండపాలను పూలమాలలతో అలంకరించారు. కల్యాణ మహోత్సవానికి ముందు స్వామి, అమ్మ వార్ల విగ్రహాలను గ్రామాల్లో ఊరేగింపు నిర్వహించారు. పినపాకలో రామాలయం లో ఎంపీపీ గుమ్మడి గాంధీ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.