మన్యం న్యూస్ మణుగూరు టౌన్ మార్చి 30
మణుగూరు పివి కాలనీ రామాలయం లో గురువారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభోగంగా నిర్వహించడం జరిగింది.ఈ కళ్యాణంలో ఏరియా జిఎం దుర్గం రామచందర్ దంపతులు పాల్గొన్నారు.వేద పండితులు, మేళ తాళాల నడుమ అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణాన్ని నిర్వహించడం జరిగింది. సింగరేణి కుటుంబ సభ్యులు 4000 మంది సీతారాముల కళ్యాణం లో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో వీక్షించారు.అనంతరం స్వామివారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సింగరేణి ఉన్నతాధికారులు,టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వి. ప్రభాకర్ రావు,సింగరేణి కార్మికులు,వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.