మన్యం న్యూస్,ఇల్లందు..శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం భద్రాచలంలో వీక్షించడానికి వెళ్లిన ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ నాయక్ దంపతులు శ్రీ సీతారామ చంద్రస్వామి దర్శనానంతరం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీరామనవమి సందర్భంగా మంత్రికి శుభాకాంక్షలు తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే ఇల్లందు నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని సీతారాములను వేడుకున్నట్లు తెలిపారు.మంత్రిని కలిసిన వారిలో ఇల్లందు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జెకె శ్రీను తదితరులు ఉన్నారు.