మన్యం న్యూస్, పినపాక:
ఏప్రిల్ 5వ తేదిన జరిగే బిఆర్ఎస్ పార్టీ పినపాక మండల ఆత్మీయ సమ్మేళనానికి హజరు కావాలని కోరుతూ ఏడూళ్ల బయ్యారం పంచాయతీలో సర్పంచ్ కోరం రజిని, గ్రామ అధ్యక్షుడు బూర రమేష్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఆహ్వానించారు. ఆత్మీయ సమ్మేళనంతో పంచాయతీలోని సమస్యల పరిష్కారం చర్చించుకుందాం అని సర్పంచ్ రజిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.